Mon Feb 02 2026 03:20:51 GMT+0000 (Coordinated Universal Time)
Vande Bharath Trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
వందేభారత్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

వందేభారత్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో స్లీపర్ కోచ్ ప్రోటో టైప్ వెర్షన్ ను అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు.
మూడు నెలల్లో...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దేశమంతా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సక్సెస్ కావడంతో స్లీపర్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టేందుకు శ్రమించామన్నారు. దాదాపు పదిరోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పిన అశ్వినీ వైష్ణవ్ వచ్చే మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Next Story

